ఓడిన్ యూఎస్ ఓపెన్ జేత్రయాత్రకు బ్రేక్

అమెరికా టీనేజ్ సంచలనం మెలానీ ఓడిన్ యూఎస్ ఓపెన్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. తాజా యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌కు చేరుకొని క్రీడా పండితులను విస్మయానికి గురిచేసిన ఓడిన్ బుధవారం ఇంటిముఖం పట్టింది.

కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టిన ఓడిన్ ఇక్కడ మాత్రం పేలవమైన ప్రదర్శన కనబరిచింది.

పేలవమైన సర్వీసులు, అనవసర తప్పిదాల కారణంగా ఓడిన్ క్వార్టర్స్‌లో మూల్యం చెల్లించుకుంది. తొమ్మిదో సీడ్ డానే కరొలినే వోజ్నియాకీ ఈ మ్యాచ్‌లో 6-2, 6-2తో 17 ఏళ్ల ఓడిన్‌పై సునాయస విజయం సాధించింది.

ఈ విజయంతో కరొలినే వోజ్నియాకీ ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే బెల్జియం క్రీడాకారిణి యానినా విక్‌మేయర్ 7-5, 6-4తో ఉక్రేయిన్‌కు చెందిన కటెరినా బోండరెంకోని ఓడించి చివరి నలుగురిలో స్థానం దక్కించుకుంది.

వెబ్దునియా పై చదవండి