కింగ్‌ఫిషర్ క్రైసిస్ : ఎఫ్-1లో పాల్గొనడం గర్వంగా ఉంది : విజయ్ మాల్యా

బుధవారం, 24 అక్టోబరు 2012 (11:59 IST)
File
FILE
దేశ ప్రజలకు కారుచౌక విమానయాన ప్రయాణ సౌకర్యం కల్పించిన లిక్కర్ డాన్ విజయ్ మాల్యా. ప్రస్తుతం తాను స్థాపించిన ప్రైవేట్ విమానయాన సంస్థ కింగ్‌ఫిషర్ రెక్కలు తెగిపోతే.. తనకేం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

ఈ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు ఆర్థిక కష్టాల్లో చిక్కుకుని ఆత్మహత్యలకు పాల్పడుతుంటే విజయ్ మాల్యాతో పాటు.. ఆయన పుత్రరత్నం సిద్ధార్థ్ మాల్యాలు విదేశాల్లో మోడల్స్‌తో ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు.. కింగ్‌ఫిషర్ లైసెన్సులను కూడా డీజీసీఏ రద్దు చేసినా వారిద్దరేమీ ఆందోళన చెందడం లేదు.

ఈ నేపథ్యంలో త్వరలో భారత్‌లో ప్రారంభంకానున్న ప్రతిష్టాత్మక ఎఫ్-1 రేసింగ్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల్లో విజయ్ మాల్యాకు చెందిన జట్టు కూడా పాల్గొననుంది. దీనిపై ఆయన మాట్లాడుతూ భారత్‌లో ఫార్ములావన్ రేసు జరగనుండటం, అందులో తన జట్టు మూడు రంగుల కార్లతో పోటీపడటం గర్వంగా ఉందని ఫోర్స్‌ ఇండియా అధినేత అయిన విజయ్‌ మాల్యా చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి