కెరీర్‌కు స్వస్తి పలికిన భారత వరల్డ్ ర్యాలీ డ్రైవర్ నరేన్

శనివారం, 23 జులై 2011 (08:55 IST)
తన 18 యేళ్ళ అంతర్జాతీయ కెరీర్‌కు భారత వరల్డ్ డ్రైవర్ నరేన్ కుమార్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ కేరీర్‌లో ఎన్నో దేశ, అంతర్జాతీయ పతకాలను సాధించిన నరేన్‌ భారతకు వరల్డ్‌ ర్యాలీలో మంచి పేరు సంపాదించి పెట్టాడు. 1999, 2000, 2002, 2003, 2005, 2006, 2010వ సంవత్సరాల్లో జాతీయ టైటిల్స్‌ను సాధించాడు. అంతేకాకుండా ఆసియాజోన్‌ టైటిల్‌ను 2001లో అందుకోగా, 2008లో జరిగిన వరల్డ్‌ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

దీనిపై నరేన్ కుమార్ స్పందిస్తూ రెడో రోస్టర్‌ రేసింగ్‌ సహకారంతో ఏడో నేషనల్‌ టైటిల్‌ గత సంవత్సరం గెలిచాను. ఈ సమయం నా రిటైర్‌మెంట్‌కి సరైందిగా తాను భావిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. నా రిటైర్‌మెంట్‌ని ప్రకటించటం కొంచెం బాధగా ఉన్నప్పటికీ తప్పడం లేదన్నారు. తన 18యేళ్ళ కెరీర్‌లో నాకు మద్దతునిచ్చిన వారికి నన్ను ప్రోత్సహించిన వారికి కృతజ్ఞతలు చెపుతున్నాను.

వెబ్దునియా పై చదవండి