చెస్ ర్యాంకింగ్స్‌: మళ్లీ అగ్రస్థానంలో విశ్వనాథన్ ఆనంద్!

FILE
ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్‌లో విశ్వవిజేత విశ్వనాథన్ ఆనంద్ అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. 2804 సొంత పాయింట్లతో విశ్వనాథన్ ఆనంద్ మళ్లీ నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు.

ప్రపంచ చెస్ చరిత్రలో 2804 పాయింట్లతో విశ్వనాథన్ ఆనంద్ అగ్రస్థానంలో నిలవడం ఐదోసారి కావడం గమనార్హం. అంతకుముందు విశ్వనాథన్ ఆనంద్ 2008లో 2803 పాయింట్లతో అత్యున్నత స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.

చైనాలో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్ పోటీల్లో రెండో స్థానంలో నిలిచినప్పటికీ, తాజాగా విడుదలైన చెస్ ర్యాంకింగ్స్‌లో మాత్రం అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు.

వెబ్దునియా పై చదవండి