జర్మనీ విజయావకాశాలకు విదేశీ ఆటగాళ్లే కీలకం!

ఆఫ్రికా ఖండంలో జరుగుతున్న సాకర్ ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీల్లో జర్మనీ జట్టు చేతిలో ఫుట్‌బాల్ కప్ దిగ్గజం అర్జెంటీనా నేలకొరిగింది. ఈ జట్టు ఓటమికి ప్రత్యర్థి జట్టులోని విదేశీ ఆటగాళ్లే కీలక పాత్ర పోషించారు. వీరంతా జర్మనీ జట్టులోనే ఉన్నారు.

సాధారణంగా ఏ జట్టులోనైనా ఒకరిద్దరు విదేశీ ఆటగాళ్లు ఉంటారు. కానీ, జర్మనీ జట్టులో ఏకంగా 11 మంది విదేశీ ఆటగాళ్లు ఉండటం గమనార్హం. శనివారం అర్జెంటీనాతో జరిగిన జర్మనీ జట్టులోనూ ఆరుగురు విదేశీ ఆటగాళ్లు కీలక పాత్ర పోషించడం గమనార్హం.

మిరొస్లావ్ క్లోజ్, లూకాస్ పొడోల్‌స్కీ, మీసట్ ఒజిల్, కకావ్, మరియో గొమెజ్, జెరోమ్ బొటెంగ్, పాయిటర్ ట్రోచోవ్‌స్కీ, సమి ఖేదిరా, మార్కో మారిన్, సెర్డర్ టేసి, డేనిస్ అవోగోలు జర్మనీ జట్టులో ఉన్న విదేశీ ఆటగాళ్లు.

వెబ్దునియా పై చదవండి