టాప్-50లో స్థానం సంపాదించడమే లక్ష్యం: సోమదేవ్

FILE
భారత టెన్నిస్ ఆటగాడు, యువ సంచలనం సోమదేవ్ దేవ్‌వర్మన్ టాప్-50లో స్థానం సంపాదించాలనుకుంటున్నాడు. గత ఏడాది టాప్-100లో స్థానం దక్కించుకోవాలన్న సోమదేవ్, అనుకున్నట్లే ప్రపంచ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 80వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇదే తరహాలో ఏడాదిలోపు టాప్-50లో స్థానం సంపాదించడమే లక్ష్యమంటున్నాడు.

దక్షిణాఫ్రికా టెన్నిస్ టోర్నమెంట్ సింగిల్స్ రన్నరప్‌గా నిలిచిన భారత సంచలనం సోమదేవ్ దేవ్‌వర్మన్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకును సాధించిన సంగతి తెలిసిందే. సౌత్ ఆఫ్రికా టెన్నిస్ టోర్నీలో ఓడిపోయినప్పటికీ, తాజాగా విడుదలైన ఏటీపీ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో సోమదేవ్ ఏకంగా 30 స్థానాలు ఎగబాకి టాప్-100లో స్థానం దక్కించుకున్నాడు.

ప్రతీ టూర్‌ను ఛాలెంజింగ్ తీసుకుని అద్భుతమైన ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకుంటానని చెప్పాడు. ప్రస్తుతానికి తాను కోర్టులో మెరుగ్గా ఆడుతున్నానని సోమదేవ్ చెప్పాడు. జోహెన్స్‌బర్గ్‌లో సౌత్ఆఫ్రికన్ టెన్నిస్ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచిన తాను ఈ ఏడాది మరిన్ని టెన్నిస్ టోర్నమెంట్లలో పాల్గొంటానన్నాడు.

ఇంకా ఆటలోని మెళకువలను నేర్చుకుని అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తానని అన్నాడు. ఏటీపీ ర్యాంకింగ్స్‌ టాప్-100లో స్థానం దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి