టైగర్ వుడ్స్ ప్రేమాయణంపై పుస్తకం రాస్తా: జోలీ

FILE
వివాహేతర సంబంధాలతో తన వ్యక్తిత్వాన్ని కించపరుచుకున్న గోల్ఫ్ స్టార్ టైగర్ వుడ్స్ రాసలీలలను త్వరలో పుస్తక రూపంలో రానున్నాయి. గతంలో వుడ్స్‌తో వివాహేతర సంబంధం నెరపిన 26 ఏళ్ల లోరెడానా జోలీ ఫెరియోలో వుడ్స్ ప్రేమాయణం సంగతులను కళ్లకు కట్టినట్లు పుస్తకం రూపంలో రాసేస్తానని అంటోంది.

వుడ్స్‌తో తన శృంగార జీవితానికి సంబంధించిన వివరాలన్నింటిని ఈ పుస్తకంలో బట్టబయలు చేస్తానని లోరెడానా పేర్కొంది. ఈ మేరకు కొన్ని ప్రచురణ సంస్థలను కూడా సంప్రదిస్తోందని సమాచారం.

ఇదిలా ఉంటే.. వివాహేతర సంబంధాలతో తన ప్రతిష్టను మసకబార్చుకున్న అమెరికన్ గోల్ఫ్ స్టార్ టైగర్ ఉడ్స్ రాసలీలల భాగోతంలో తాజాగా భారతీయ భామ వచ్చి చేరిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ సుందరాంగి లారాదత్తా గతంలో టైగర్‌తో డేటింగ్ కొనసాగించిందని ఇటీవల వార్తలొచ్చిన సంగతి విదితమే.

ఇంకా 2000 సంవత్సరంలో ప్రపంచ సుందరిగా ఎంపికైన ఈ ముద్దుగుమ్మ లారాదత్తా, ఆ మరుసటి ఏడాది టైగర్ ఉడ్స్‌తో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగినట్లు ఓ పత్రిక ప్రచురించిన విషయం తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి