త్వరలోనే నోవాక్ జకోవిచ్ పెళ్లి : 8 ఏళ్లు ప్రేమికులు..?

FILE
టెన్నిస్ స్టార్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఎనిమిదేళ్ల పాటు తాను ప్రేమించిన ప్రియురాలినే పెళ్లాడనున్నాడు. తన ప్రియురాలు జెలెనా రిస్టిక్‌తో త్వరలోనే నోవాక్ జకోవిచ్ వివాహం కాబోతోందని ఓ టీవీ షోలో సెర్బియా స్టార్ టెన్నిస్ ప్లేయర్, ప్రపంచ నెంబర్ 2 నోవాక్ జకోవిచ్ ధృవీకరించాడు.

‘జెలెనా వీలైనంత ఎంజాయ్ చేయ్. రెండు, మూడు నెలల్లో నీ పేరు చివర జకోవిచ్ రాబోతుంది’ అని రిస్టిక్‌తో అన్నాడు. కాగా జకోవిచ్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థను ఆమె నిర్వహిస్తోంది.

వెబ్దునియా పై చదవండి