డిఫెండర్ పవన్ కుమార్ సారథ్యంలో 20 మంది సభ్యులుగల ఢిల్లీ ఫుట్‌బాల్ జట్టును డీఎస్ఏ బుధవారం ఎంపికచేసింది. గుర్గాన్ మరియు ఫరీదాబాద్‌లలో ఫిబ్రవరి 11 నుంచి 28 వరకు జరుగనున్న దత్తా రే ట్రోఫీలో ఈ జట్టు పాల్గొంటుంది. 19వ జాతీయ ఫుట్‌బాల్ అండర్-21 విభాగంలో ఈ ట్రోఫీని నిర్వహిస్తున్నారు.
న్యూఢిల్లీలోని అంబేద్కర్ స్టేడియంలో 20 రోజుల ఓపెన్ ట్రయల్ కోచింగ్ క్యాంపు నిర్వహించిన డీఎస్‌ఏ సెలెక్టన్ కమిటీ అనంతరం సమావేశమై 20 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో మిడ్‌ఫీల్డర్ మోను చౌదరిని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
జట్టు సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి.
గోల్ కీపర్లు: శ్రీకాంత్ సింగ్, సురాజ్ శర్మ, గోబింద్ సేథీ, విశ్వజిత్ నేగి