నెహ్రూ కప్: ప్రారంభ మ్యాచ్‌లో భారత్‌ ఓటమి

File
FILE
ప్రతిష్టాత్మక నెహ్రూ కప్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో లెబెనాన్ చేతిలో భారత్ అనూహ్యంగా ఓటమి చవిచూసింది. ప్రారంభ మ్యాచ్‌లో సరైన ఆరంభాన్నివ్వలేకపోయిన భారత్ ఆ తర్వాత కూడ మెరుగైన ప్రదర్శన కనబరచలేకపోయింది. దీంతో భారత్ 0-1తో లెబెనాన్ చేతిలో కంగుతింది.

ఆట జరుగుతున్న ఐదో నిమిషంలోనే లెబెనాన్ డిఫెండర్ అలీ అల్ సాద్ ఫ్రీ-కిక్‌తో గోల్ చేశాడు. శుభారంభం చేసిన లెబెనాన్‌ను నిలువరించడానికి భారత్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. గాయపడ్డ భారత స్ట్రైకర్ సునీల్ ఛత్రీ ఈ మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమయ్యాడు.

సుశీల్ సింగ్ భాగస్వామ్యంతో బైచుంగ్ భూటియా.. భారత్‌కు 4-4-2తో ఆరంభాన్నిచ్చాడు. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో భారత్ చాలా వరకు లెబెనాన్‌పై ఆధిపత్యం వహించింది. కానీ... లెబెనాన్ ఆటగాళ్లు ఆట ముగింపు చేరుకుంటండగా రెచ్చిపోయి ఆడారు.

నలుగురు ప్రధాన ఆటగాళ్లు లేకుండా దిగినప్పటికీ.. లెబెనాన్ తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శననివ్వడం గమనార్హం. భారత్‌ కూడా బాగానే ఆడినప్పటికీ.. మెరుగైన ప్రదర్శనలో గోల్స్ చేయడంలో విఫలమయ్యారు.

వెబ్దునియా పై చదవండి