నెహ్రూ కప్ ఫుట్‌బాల్: గెలుపుపై భారత్ ధీమా

File
FILE
ప్రతిష్టాత్మక నెహ్రూ కప్ ఫుట్‌బాల్ టోర్నీ నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రారంభ మ్యాచ్‌లో భారత్.. బలమైన ప్రత్యర్థి లెబెనాన్‌తో తలపడనుంది. బార్సిలోనాలో ఒక మాసం పాటు సుదీర్ఘ శిక్షణలో గడిపిన అనంతరం డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు తొలిసారిగా అంతర్జాతీయ టోర్నీలో పాల్గొంటోంది.

ఈ టోర్నీలో ఏ ఒక్క విజయంతోనే సంతృప్తి పడకూడదనే ఉద్దేశ్యంతో ఫుట్‌బాల్ కోచ్ బాబ్ హగ్టన్ ఉన్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. మోకాలి గాయంతో బాధపడుతున్న భారత జట్టు స్టైకర్ సునీల్ ఛత్రీ ఈ టోర్నీలో ఉపయోగపడగలడని హగ్టన్ భావిస్తున్నారు.

ఛత్రీ గాయం భారత జట్టుకు ఓ మిస్టరీ లాంటిదే కానీ.. అంతకంటే.. ముందు ఈ టోర్నీకి తిరిగి వస్తే.. జట్టు బలోపేతమవుతుందని హగ్టన్ అనుకుంటున్నట్లు తెలిసింది. హగ్టన్ మాట్లాడుతూ, బార్సిలోనా పర్యటనను భారత జట్టు విజయవంతంగా ముగించిందన్నారు.

దీంతో నెహ్రూ కప్‌లోను భారత్ మెరుగైన ప్రదర్శనతో సంచలన విజయాలకేమీ కొదవేమీ ఉండకపోవచ్చని హగ్టన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ టోర్నీలో పాల్గొంటున్న సిరియా మరియు ఇతర జట్లకు భారత జట్టుకు మధ్య ర్యాంకుల్లో బాగా తేడా ఉంది.

కానీ, 2007 ఫైనల్లో 95వ ర్యాంకులో ఉన్న సిరియాను 1-0తో భారత్ ఓడించిన విషయాన్ని హగ్టన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు కూడా భారత జట్టు సత్తా కలిగిన ఆటగాళ్లున్నారని.. ఎంత ఒత్తిడిలోనైనా వారు రాణించగలరని హగ్టన్ వ్యాఖ్యానించారు. అందులోను బార్సిలోనా శిక్షణ వంటి అంశాలు ఈ టోర్నీలో భారత్‌కు కలిసి వచ్చే అంశాలుగా తెలిపారు.

వెబ్దునియా పై చదవండి