ప్రపంచ కప్ టోర్నీలో భారత్ విజయం సాధిస్తుంది!

శనివారం, 17 మే 2014 (09:28 IST)
FILE
నెదర్లాండ్స్‌తో జరిగిన ప్రపంచ కప్ హాకీ చాంపియన్‌షిప్‌లో సర్దార్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న భారత్ అద్భుతాలు సృష్టిస్తుందని, సంచలన విజయాలు నమోదు చేస్తుందని జట్టు పర్ఫార్మెన్స్ డైరెక్టర్ రోలాండ్ ఆల్ట్‌మన్స్ జోస్యం చెప్పాడు.

హాకీ ఇండియా (హెచ్‌ఐ) మొదలు హెడ్ కోచ్ టెర్రీ వాల్ష్ వరకు, అధికారుల నుంచి మాజీ ఆటగాళ్ల వరకూ ఎవరికీ వరల్డ్ కప్‌లో భారత్ సాధిస్తుందన్న నమ్మకం లేదని ఆల్ట్‌మన్స్ తెలిపాడు.

2010లో మొత్తం 12 జట్లు పోటీపడగా, భారత్ ఎనిమిదో స్థానంతో సంతృప్తి చెందిన విషయాన్ని ప్రస్తావించగా, వాల్ష్ కోచింగ్‌లో ఇప్పుడు జట్టు మెరుగుపడిందని అన్నాడు.

ప్రపంచ నంబర్‌వన్ ఆస్ట్రేలియా, స్పెయిన్, బెల్జియం, ఇంగ్లాండ్, మలేషియాలతో కలిసి ఒకే పూల్‌లో ఉన్న భారత్‌కు గట్టిపోటీ తప్పదని ఆల్ట్‌మన్స్ అంగీకరించాడు. సవాళ్లను ఎదుర్కొని సర్దార్ సింగ్ సేన రాణిస్తుందనే నమ్మకం తనకు ఉందన్నాడు.

వెబ్దునియా పై చదవండి