భారతదేశ పురుషుల టాప్ టెన్నిస్ ఆటగాడు సోమదేవ్ దేవ్‌వర్మన్ ప్రముఖ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీ అయిన లాగార్‌డేరే అన్‌లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఆండీ రాడిక్, జస్టిన్ హెనిన్, టామీ హాస్, గేల్ మోన్‌ఫిల్స్, రిచర్డ్ గాస్కెట్, ఆంద్రే సా, ఫెర్నాండో గోంజాలెజ్ మరియు నదియా పెట్రోవాలు నిర్వహిస్తున్న లాగార్‌డేరే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటూ సంతకాలు చేశాడు.
ఈ విషయమై లాగార్‌డేరే ప్రెసిడెండ్ కెన్ మేయర్‌సన్ మాట్లాడుతూ.. సామర్థ్యం, లౌక్యం కలగలిసిన సోమదేవ్ ఇంటర్నేషనల్ ప్రొఫైల్ ప్రపంచవ్యాప్తంగా అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోందన్నాడు. సోమ్‌దేవ్ ప్రాతినిధ్యంలో తమ సంస్థ లాభాలను పెంచుకునేందుకు ఇదే సరైన సమయమని అన్నాడు.
ప్రస్తుతం ప్రపంచంలో 141వ ర్యాంక్ ఆటగాడిగా దూసుకెళ్తున్న సోమదేవ్ మాట్లాడుతూ.. టెన్నిస్‌లో ఆర్నౌడ్ లాగార్‌డేరే ఫ్యాషన్‌ను సృష్టించిన ఇలాంటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవటం చాలా సంతోషాన్నిస్తోందన్నాడు. అందుకే లెక్కలేనన్ని గ్రాండ్ స్లామ్‌లను అందించిన అనేకమంది మేటి క్రీడాకారులకు ప్రాతినిధ్యం వహించిన ఇలాంటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవటం అనేది ఆటోమేటిగ్గా జరిగిపోయిందన్నాడు.