వెటల్ దూకుడుకు బ్రేక్ వేసిన లూయిస్ హామిల్టన్

మంగళవారం, 20 నవంబరు 2012 (17:07 IST)
FILE
అద్భుత ఫామ్‌తో విజయపరంపర కొనసాగస్తూ, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకోవడానికి ఉవ్విళ్లూరుతున్న ఫెర్నాండో అలొన్సోతో పోటీ పడుతున్న రెడ్‌బుల్ డ్రైవర్ సెబాస్టియన్ వెటల్ దూకుడుకు మెక్‌లారెన్ రేసన్ లూయిస్ హామిల్టన్ గండి కొట్టాడు.

యుఎస్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేస్‌లో 27 ఏళ్ల హామిల్టన్ పోల్‌పొజిషన్‌లో రెండు స్థానం నుంచి పోటీపడినప్పటికీ, 42వ ల్యాప్‌లో వెటెల్‌ను అధిగమించి కెరీర్‌లో 21వ టైటిల్ సాధించాడు. వెటెల్ ద్వితీయ స్థానానికి పరిమితంకాగా, ఫెరారీ డ్రైవర్ అలొన్సో తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

వెబ్దునియా పై చదవండి