సహాయం చేస్తాం: యూకీకి షీలా హామీ

బుధవారం, 4 ఫిబ్రవరి 2009 (11:54 IST)
టెన్నిస్ క్రీడలో మరింత రాణించేందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఆస్ట్రేలియన్ ఓపెన్ బాలుర సింగిల్స్ ఛాంపియన్ యూకీ భాంబ్రీకి ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హామీ ఇచ్చారు. తాను మరింతగా రాణించాలన్నా, భారత్ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపచేయాలన్నా ప్రభుత్వ సహాయం ఎంతో అవసరమని యూకీ భాంబ్రీ అభిప్రాయపడిన విషయం తెల్సిందే. దీనిపై షీలా దీక్షిత్ స్పందించి అన్ని రకాల సాహాయం చేసేందుకు హామీ ఇచ్చారు.

కాగా, యూకీ భాంబ్రీకి ఢిల్లీ ప్రభుత్వం రూ.ఐదు లక్షల అవార్డును ప్రకటించదని చెప్పారు. ఈ సందర్భంగా షీలా దీక్షిత్ మాట్లాడుతూ భవిష్యత్‌లో ఎలాంటి సహాయాన్నైనా అందించేందుకు సిద్ధంగా షీలా దీక్షిత్ వెల్లడించారు. యూకీ భాంబ్రీ, అతని తల్లి ఇందు మంగళవారం 15 నిమిషాల పాటు షీలా దీక్షిత్‌తో సమావేశయ్యారు. వీరి వెంట ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ అనిల్ ఖన్నా, మరో ఇద్దరు అధికారులు కూడా ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి