హాల్ ఆఫ్ ఫేమ్ టోర్నమెంట్ రెండో రౌండ్లో భారత్ టెన్నిస్ సంచలనం సోమ్‌దేవ్ వర్మన్ ఓడిపోయాడు. తొలి రౌండ్లో ప్రత్యర్థిపై గట్టిపోటీని ప్రదర్శించిన సోమదేవ్ దేవ్‌వర్మన్, రెండో రౌండ్లో పరాజయం పాలైయ్యాడు.
అన్‌సీడెడ్ ఆటగాడిగా ఈ టోర్నీ బరిలోకి దిగిన సోమదేవ్ వర్మన్ రెండో రౌండ్లో అమెరికా ప్రత్యర్థి అయిదో సీడ్ మార్డిఫిష్ చేతిలో ఖంగుతిన్నాడు. ఈ రౌండ్లో 2-6, 0-6 తేడాతో పరాజయం పాలైయ్యాడు. అమెరికాకు చెందిన కెవిన్కిమ్తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సోమ్‌దేవ్ 6-4, 6-3తో వరుస సెట్లలో విజయం సాధించిన సోమదేవ్.. రెండో రౌండ్లో ధీటుగా రాణించలేకపోయాడు.
గత నెల జరిగిన క్వీన్స్ క్లబ్ టోర్నీలో ఫిష్ చేతిలో తొలి రౌండ్ మ్యాచ్‌లో పరాజయం పాలైన ఈ భారత్ యువకెరటం ఆ పరాజయానికి ఈసారి ప్రతికారం తీర్చుకోవాలనుకున్నాడు. కానీ హాల్ ఆఫ్ ఫేమ్ రెండో రౌండ్లోను మార్డిఫిష్కే విజయం దక్కింది.