ఛాంపియన్స్ ట్రోఫీ: పాక్ ఆటగాళ్ల అసభ్య సంజ్ఞలు: ఒక్కే ఒక్క మ్యాచ్ నిషేధం!

సోమవారం, 15 డిశెంబరు 2014 (12:19 IST)
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఆడకుండా పాక్‌ హాకీ ఆటగాళ్లు అంజాద్‌ అలీ, మహమ్మద్‌ తౌసిక్‌పై అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) వేటు వేసింది. భారత్‌తో శనివారం జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ సందర్భంగా ప్రేక్షకులకు అసభ్యకర సంజ్ఞలు చేసిన పాక్‌ ఆటగాళ్లపై ఎఫ్‌ఐహెచ్‌ కొరఢా ఝుళిపించింది. 
 
దోషులుగా తేలిన అంజాద్‌, తౌసిస్‌పై తక్షణం ఓ మ్యాచ్‌ నిషేధం విధించింది. పాక్‌ ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే భారత్‌లో జరబోయే అంతర్జాతీయ టోర్నీలను బహిష్కరిస్తామని భారత హాకీ సంఘం (హెచ్‌ఐ) గట్టిగా హెచ్చరించిన నేపథ్యంలో ఎఫ్‌ఐహెచ్‌ దిగొచ్చింది. ఫలితంగా ఇద్దరి ఆటగాళ్లపై వేటు.. మరో ఆటగాడికి వార్నింగ్ ఇచ్చినట్లు ఎఫ్ఐహెచ్ వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి