బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ కోచ్‌ను మార్చేయడంపై వ్యాఖ్యానించేందుకు ఆల్ ఇంగ్లండ్ మాజీ ఛాంపియన్, కోచ్ పుల్లెల గోపిచంద్ నిరాకరించారు. ప్రస్తుతానికి తాను పీవీ సింధు సాధించిన విజయాన్ని ఆస్వాదిస్తున్నానని.. ఈ పరిస్థితుల్లో సైనా నెహ్వాల్ గొడవెందుకని ప్రశ్నించారు.