కొద్దిసేపటి క్రితం ముగిసిన రెండో సెమీ ఫైనల్లో మ్యాడిసన్ కీస్పై సెరెనా విజయం సాధించింది. వరుస సెట్లలో 7-6, 6-2 స్కోరుతో సునాయాసంగా నెగ్గిన సెరెనా విలియమ్స్, ఫైనల్లో రష్యా బ్యూటీ మారియా షరపోవాతో పోరుకు రెడీ అవుతోంది.
గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో షరపోవా, మకరోవాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఎనిమిదేళ్ల క్రితం ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో సెరెనా, షరపోవాలు టైటిల్ కోసం తలపడ్డారు.