సైనా నెహ్వాల్ బయోపిక్: దీపిక అయితేనే సరిపోతుంది.. అవకాశం వస్తే..?

గురువారం, 4 ఫిబ్రవరి 2016 (14:08 IST)
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్‌పై ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది. తన జీవిత చరిత్రను సినిమాగా తీస్తే తన పాత్రకు బాలీవుడ్ నటి దీపికా పదుకునే అయితే సరిపోతుందని బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఢిల్లీ అవార్డుల కార్యక్రమంలో సైనా నెహ్వాల్ మాట్లాడుతూ.. తన పాత్రకు దీపిక అయితే సరిగ్గా సరిపోతుందని చెప్పింది. ఇందుకోసం దీపిక శ్రమపడాల్సిన అవసరం లేదని సైనా నెహ్వాల్ వెల్లడించింది. 
 
ఒలింపిక్ పతకం సాధించిన సైనా జీవిత చరిత్రను సినిమాగా తీయాలని దర్శకుడు అమోల్ గుప్తా భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీపికా పదుకునే గతంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కావడంతో తన పాత్రను అద్భుతంగా పండిస్తుందని సైనా నెహ్వాల్ చెప్పుకొచ్చింది. తామిద్దరం ఎన్నోసార్లు బ్యాడ్మింటన్ ఆడామని సైనా నెహ్వాల్ తెలిపింది. మరోవైపు దీపికా పదుకునే అవకాశం వస్తే సైనా పాత్రలో నటిస్తానని స్పష్టం చేసింది. 

వెబ్దునియా పై చదవండి