కానీ, క్లోజ్ విన్యాసాన్ని అనుకరించబోయి ప్రాణాలు కోల్పోయాడు. మిజోరం ప్రీమియర్ లీగ్ (ఎమ్‌పీఎల్)లో భాగంగా గత మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో బెత్లెహామ్ క్లబ్ మిడ్‌ఫీల్డర్ పీటర్ బియాక్సాంగ్జౌలా గోల్ చేశాడు. ఆ ఆనందంలో గాల్లోకి పల్టీలు కొట్టాడు. రెప్పపాటులో ఓ పల్టీ కొట్టిన అతను మరో పల్టీ పూర్తయ్యేలోపే మైదానంలో కుప్పకూలాడు.