పిస్టోరియస్ కంటతడి.. దోషిగా తేలితే జీవితఖైదు?

గురువారం, 11 సెప్టెంబరు 2014 (17:20 IST)
2013 ప్రేమికుల రోజున తన నివాసంలో బాత్రూంలో ఉన్న ప్రేయసి రీవాను కాల్చి చంపిన కేసులో ''బ్లేడ్ రన్నర్'' ఆస్కార్ పిస్టోరియస్ కంటతడి పెట్టాడు. ఎందుకంటే తాను ఆమెను కావాలనే కాల్చి చంపలేదని, పొరపాటున అలా జరిగిపోయిందని వాదిస్తున్న పిస్టోరియస్‌కు వారం రోజుల్లో శిక్ష పడే ఛాన్సుంది. 
 
తన మోడల్ ప్రియురాలు రీవా స్టీన్ కాంప్ హత్య కేసులో జడ్జి తీర్పు చదువుతుండగా, నిందితుడు 'బ్లేడ్ రన్నర్' ఆస్కార్ పిస్టోరియస్ కంటతడి పెట్టాడు. ఆ సమయంలో సందర్శకుల గ్యాలరీలో కూర్చున్న అతను ఏడవడం కనిపించింది. 
 
ఈ తీర్పు పూర్తిగా చదివేందుకు రెండు రోజుల సమయం పడుతుందని అంటున్నారు. తర్వాత శిక్ష ఖరారుకు వారం రోజులు పడుతుందంటున్నారు. 
 
2013లో ప్రేమికుల రోజున తన నివాసంలో బాత్రూంలో ఉన్న ప్రేయసి రీవాను ఆస్కార్ కాల్చి చంపినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దాంతో, అతనిపై కేసు నమోదవగా చాలా రోజులు దర్యాప్తు జరిగింది. ఈ హత్య కేసులో అతను దోషిగా తేలితే జీవితఖైదు పడుతుందని అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి