రియో ఒలింపిక్స్‌లో భారత్ బోణీ: కాంస్యంతో మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ అదుర్స్

గురువారం, 18 ఆగస్టు 2016 (14:13 IST)
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో భారత్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. మహిళల రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో సాక్షి మాలిక్ కాంస్య పతకంతో భారత్‌కు తొలి పతకాన్ని సంపాదించిపెట్టింది. కిర్జిస్తాన్ క్రీడాకారిణి టైనీ బెకోవాను మట్టికరిపించిన సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా రికార్డు సృష్టించింది. మొత్తం ఆరు నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో… మొదటి మూడు నిమిషాల్లో సాక్షి 0-3తో వెనుకంజలో నిలిచింది.
 
సెకండాఫ్‌లో పుంజుకున్న సాక్షి నాలుగో నిమిషంలో వరుసగా నాలుగు పాయింట్లు సాధించి, ఆపై చివరి సెకన్లలో మరో మూడు పాయింట్లు సాధించి.. 7-5తో గెలుపును నమోదు చేసుకుంది. ఇకపోతే.. రియోలో స్వర్ణం గెలిచిన సాక్షి మాలిక్‌కు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా  సమంత సాక్షి మాలిక్‌కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది.

వెబ్దునియా పై చదవండి