హైదరాబాదీ స్టార్ ప్లేయర్, బ్యాడ్మింటన్ తెలుగు తేజం షట్లర్ పీవీ సింధుకు ఈ ఏడాది బాగానే కలిసొచ్చింది. రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన పీవీ సింధు ప్రస్తుతం సెలెబ్రిటీల సరసన చేరిపోయింది. క్రీడల్లో రాణిస్తూ, ఎండార్స్‌మెంట్లు, ఫ్యాషన్ వైపు అమ్మడు బాగా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు నంబర్ వన్ ర్యాంకు సాధిస్తుందని భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొనే జోస్యం చెప్పారు.
పీవీ సింధుకు సరైన శిక్షణ ఇస్తే మాత్రం తప్పకుండా బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని ప్రకాశ్ పదుకునే స్పష్టం చేసారు. సరైన శిక్షణ, సరైన షెడ్యూల్, టోర్నీల మధ్య విశ్రాంతి తీసుకుంటూ.. నిలకడగా రాణిస్తూ ముందుకెళ్తే మాత్రం తప్పకుండా సింధుకు టాప్-1 ర్యాంకు ఖాయమన్నారు.