గోపీచంద్-సైనా నెహ్వాల్... నిన్నమొన్నటి వరకు గురుశిష్య బంధానికి ప్రతీకలుగా నిలిచారు. గోపీ శిష్యరికంలో సైనా ఎన్నో టైటిళ్ళు నెగ్గింది. ఇటీవల కాలంలో ఫామ్ లేమి, ఫిట్ నెస్ సమస్యలు సైనాను పునరాలోచనలో పడేశాయి.
గతవారం డెన్మార్క్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్ సందర్భంగా సైనా తన నిర్ణయాన్ని గోపీచంద్‌కు తెలుపగా, అందుకు ఆయన 'గో ఎహెడ్' అంటూ ప్రోత్సహించారట కూడా. దీనిపై సైనా మాట్లాడుతూ, "అవును, బెంగళూరు వెళుతున్నాను. ఉబర్ కప్ సందర్భంగా విమల్ సర్ ఇచ్చిన సలహాలు ఎంతో లాభించాయి. అందుకే, ఆయన వద్ద శిక్షణ తీసుకోవాలనుకుంటున్నాను ఆసియా క్రీడల తర్వాత హైదరాబాద్ కు వచ్చేస్తాను. ఈ విషయం గోపీ సర్ కు కూడా చెప్పాను, ఆయన ఓకే చెప్పారు" అని వివరించింది.