తన ప్రాధాన్యత ఎప్పుడూ టెన్నిస్ వైపే ఉంటుందని, సినిమాలలో నటించే ఆలోచన లేదని చెప్పింది. జేమ్స్ బాండ్ పాత్ర పోషించిన హీరోల్లో తన అభిమాన నటుడు గురించి చెబుతూ… పియర్స్ బ్రాస్నన్ తన అభిమాన హీరో అని తెలిపింది.
అలాగే తన ఆత్మకథ గురించి మాట్లాడుతూ… అది ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పలేనని తెలిపింది. ఇదిలా ఉంటే, ఢిల్లీలో బాలల చలన చిత్రోత్సవంలో సానియా తన జీవితకథ ఆధారంగా తెరకెక్కే సినిమాలో దీపికా పడుకొనే నటిస్తే బాగుంటుందని చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు సానియా మీర్జా బాండ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినట్లు వార్తలు ప్రచారమైన సంగతి తెలిసిందే.