ఇటీవల జరిగిన ఓ అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీని ఫిక్సింగ్ చేసేందుకు ఈ ఆరుగురు ఆస్ట్రేలియన్లు ప్రయత్నించారు. వీరిని మెల్ బోర్న్, విక్టోరియా పట్టణంలోని పరిసర ప్రాంతాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. విక్టోరియా పట్టణంలో ముఠాగా ఏర్పడిన కొంతమంది ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారాలకు పాల్పడుతున్నారని ఓ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు.
కాగా, ఫిక్సింగ్ అనేది క్రీడా స్ఫూర్తికి వ్యతిరేకమని, క్రీడా స్ఫూర్తికి భంగం కలిగించే చర్యలు చేపట్టే వారిపై కఠిన చర్యలుంటాయని టెన్నిస్ ఆస్ట్రేలియా హెచ్చరించింది.