సైనా ట్వీట్... కేటీఆర్ ఆన్సర్: థ్యాంక్యూ సార్.. వెలకమ్ సైనా!

శుక్రవారం, 25 జులై 2014 (17:08 IST)
లండన్ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన అనంతరం బ్యాడ్మింటన్ తార సైనా నెహ్వాల్‌కు అప్పటి ఏపీ ప్రభుత్వం రూ. 50లక్షల నజరానా ప్రకటించింది. అయితే.. ఆ మొత్తం ఇప్పటివరకు చేతికి రాకపోవడంపై సైనా ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు ట్విట్టర్లో స్పందించారు. సైనా విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.
 
సైనాతో పాటు షూటర్ గగన్ నారంగ్ (రూ.50 లక్షలు), కబడ్డీ క్రీడాకారిణులు మమతా పూజారి, నాగలక్ష్మి (చెరో రూ.25 లక్షలు) కూడా నజరానా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమస్య తప్పక పరిష్కారమయ్యేలా చూస్తానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. వీరే కాకుండా రాష్ట్రానికి చెందిన ఒలింపియన్లంతా తమకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఇకపోతే.. సైనా ట్వీట్‌కు కేటీఆర్ స్పందించడంతో సైనా కృతజ్ఞతలు తెలిపింది. అందుకు కేటీఆర్ కూడా సానుకూలంగా ట్విట్టర్లో స్పందించారు. 

వెబ్దునియా పై చదవండి