కాగా, శుక్రవారం మొదలైన నాలుగుదేశాల టోర్నీలో భాగంగా చైనీస్‌తైపీతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5-0 తేడాతో గెలిచింది. ముంబైలోని ఎరీనా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు 2000 మంది మాత్రమే హాజరు కావడంతో స్టేడియం బోసిబోయి కనిపించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఛెత్రి హ్యాట్రిక్ సాధించినా ప్రేక్షకులు స్టేడియంలో లేకపోవడంతో అతనిలో సంతోషం కనిపించలేదు.
అందుకే ఛెత్రి ట్విట్టర్‌లో తన ఆవేదనను వ్యక్తంచేశాడు. యూరోపియన్ ఫుట్‌బాల్ క్లబ్ మ్యాచ్‌లను ఆదరించడంలో తప్పులేదని.. వారి ఆటతీరులో మేం సగమైనా ఆడకపోయినా మమ్మల్నీ ప్రోత్సహించాలని కోరాడు. ఇప్పటికే 97వ ర్యాంకుతో ఆటలో మెరుగవుతున్నామని.. యువ ఆటగాళ్లు రాణిస్తున్న సందర్భంలో ప్రేక్షకుల మద్దతు దొరికితే మరింతగా విజయవంతమవుతామని ఛెత్రి విశ్వాసం వ్యక్తంచేశాడు.