ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో మంగళవారం వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ వేడుకలు ఈ నెల 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, మామిడి తోరణాలను ఇప్పటికే సిబ్బంది ఏర్పాటు చేశారు.
ఈ బ్రహ్మోత్సవాలను భక్తులు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లేకపోవడంతో నిరాడంబరంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భద్రాద్రి రామాలయంలో మంగళవారం నుంచి ఈనెల 27 వరకు నిత్య కల్యాణాలను నిలిపివేయనున్నారు. అలాగే 17 నుంచి 27 వరకు దర్బారు సేవలను, ఈనెల 17 నుంచి మే 4 వరకు పవళింపు సేవలను కూడా నిలిపివేయనున్నారు.