కావలసిన పదార్థాలు : ఎండు ఖర్జూరాలు... 600 గ్రా. మైదా పిండి... ఒక కేజీ కిస్మిస్... 200 గ్రా. జీడిపప్పు... 200 గ్రా. ఉప్పు... కొద్దిగా నూనె... వేయించేందుకు సరిపడా వేయించిన శనగపప్పు... 300 గ్రా. యాలకుల పొడి... ఒక టీ. ఎండుకొబ్బరి... 400 గ్రా. పల్లీలు... 200 గ్రా.
తయారీ విధానం : మైదాపిండిలో కొద్దిగా ఉప్పు కలిపి రెండు టేబుల్స్పూన్ల నూనె, తగినన్ని నీళ్లు కలిపి ముద్దలా చేయాలి. ఎండు ఖర్జూరాల్ని దంచి అందులోని గింజల్ని తీసేసి తరువాత ఖర్జూరాల్ని మిక్సీలో వేసి కాస్త కచ్చాపచ్చాగా చేయాలి. వేరుసెనగపప్పును వేయించాలి. వీటిని జీడిపప్పు, శనగపప్పుతో కలిపి పొడి చేయాలి. ఈ పొడిలోనే కిస్మిస్, యాలకులపొడి, కొబ్బరి తురుము అన్నీ కలపాలి.
మైదాపిండిని చిన్నచిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తాలి. అందులో డ్రైఫ్రూట్ మిశ్రమాన్ని పెట్టి రెండువైపులా మూసేసి, కజ్జికాయలా వత్తాలి. ఇప్పుడు వీటిని నాలుగైదు చొప్పున నూనెలో వేయించి తీసేయాలి. వీటిలో పంచదార ఉండదు కాబట్టి, మధుమేహ రోగులు కూడా చక్కగా తినవచ్చు.