కావలసిన పదార్థాలు : గోధుమపిండి.. ఒక కప్పు బెల్లం తురుము, నెయ్యి.. ముప్పావు కప్పు బాదం, జీడిపప్పు పలుకులు.. అర కప్పు
తయారీ విధానం : బాణలిలో కొద్దిగా నెయ్యివేసి గోధుమపిండి, బాదం, జీడిపప్పులను వేయించుకోవాలి. పిండి వేడిగా ఉన్నప్పుడే బెల్లం తురుమును వేసి కలియబెట్టాలి. తరువాత ప్లేటులో నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని ఉంచి గరిటెతో నున్నగా చేయాలి. ఇప్పుడు ఇష్టమైన ఆకృతిలో ముక్కలుగా చేసి పెట్టుకుంటే రుచికరమైన సుఖిడీ తయార్..!