నెయ్యి: 3 టేబుల్ స్పూన్స్
తయారుచేయండి ఇలా : మొదటగా బంగాళదుంపలను నీటిలో ఉడికించి, తర్వాత పొక్కు తీసి మెత్తగా చిదిమి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెనుమును స్టౌ మీద ఉంచి, అందులో కొంచెం నెయ్యి పోసి వేడి చేయాలి. అలా వేడి చేసిన నెయ్యిలో మెత్తగా చిదిమిన బంగాళదుంపలను వేసి బాగా మిక్స్ చేయాలి. అలా ప్రతి నిముషానికోసారి పెనుముకు అంటుకోకుండా మిక్స్ చేస్తూ వుండాలి. అలా చేసిన తరువాత పంచదారను వేసి దానిని కూడా పూర్తిగా కరిగేవరకు బాగా కలుపుతూ ఉండాలి. ఆ విధంగా మిక్స్ చేసుకున్న హల్వాను స్టౌ నుంచి కిందకు దించి, దానిపై బాదం, పిస్తాలు పప్పులు వేసుకోవాలి. అంతే శక్తివంతమైన, రుచికరమైన హల్వా రెడీ.