పంచదార - మూడు కప్పులు
తయారీ విధానం :
ముందుగా వెడల్పాటి బాణలి పంచదారకు తగినన్ని నీటిని చేర్చి పాకం పట్టాలి. ఈ పాకంలో పాలను కలిపి పొంగి వచ్చిన తర్వాత యాలకుల పొడిని చేర్చాలి. పాకాన్ని స్టౌ మీద నుంచి దించేసి.. సిద్ధంగా ఉంచిన శెనగపిండిలో, పాలను కలిపి బూందీకి తగ్గట్లు కలుపుకోవాలి.
పాన్‌లో నెయ్యిని పోసి వేడయ్యాక.. జారుగా కలిపివుంచిన శెనగపిండి మిశ్రమాన్ని బూందీ రూపంలో జారనివ్వండి. బూందీలను బంగారం రంగు వచ్చేంతవరకు వేయించి మరో ప్లేటులోకి తీసుకోవాలి. ఈ బూందీలను సిద్ధంగా ఉంచుకున్న పాకంలో కలుపుకుని ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేడినీటిని కలిపి లడ్డూలుగా చుట్టుకోవాలి. అంతే నోరూరించే మోతిచర్ లడ్డూ రెడీ అయినట్లే.