తయారీ విధానం : ముందుగా పెసరపప్పును నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. పంచదార, పెసరపప్పు మిశ్రమం కలిపి ఉడికిస్తూ.. నెయ్యిని కూడా అందులో చేర్చాలి. తరువాత కోవా కలిపి, యాలకుల పొడి, కిస్మిస్, జీడిపప్పు కలిపి దించేయాలి. అంతే వేడి వేడి పెసరపప్పు హల్వా రెడీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. వేడిచేసిన వారు ఇది తింటే చలువ చేస్తుంది.