తయారీ విధానం : క్యారెట్‌ను సన్నగా తురమాలి. ఒక బాణిలో క్యారెట్ తురుము, పాలు కలిపి ఉడికించాలి. పాలు ఇగిరిపోయాక అందులో నెయ్యి వేసి కాసేపు ఫ్రై చేయాలి. తరువాత దాంట్లోనే పంచదార పోసి మరికాసేపు ఉడికించాలి. ఇలా ఉడికించగా అందులో పాకం వస్తుంది. ఈ పాకం చిక్కబడ్డాక కోవాను పొడిగా చేసి చల్లాలి.
తరువాత అది బాగా దగ్గరికి వచ్చి ముద్దలా అయిన తరువాత దించేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌కు నెయ్యి రాసి.. అందులో పోసి సమంగా సర్దాలి. దానిపై వేయించిన జీడిపప్పులను కూడా వేసి కావాల్సిన సైజులో ముక్కలు కోసుకోవాలి. అంతే నోరూరించే ఎర్రటి క్యారెట్ బర్ఫీ సిద్ధమైనట్లే..! ఓ పట్టు పట్టేద్దామా..?!