కావలసిన పదార్థాలు : నానబెట్టిన సగ్గుబియ్యం... ఒక కప్పు బియ్యప్పిండి... 2 కప్పులు పంచదార... ఒకటిన్నర కప్పు చిక్కని పాలు... 2 కప్పులు బొంబాయిరవ్వ... ఒక కప్పు నీళ్లు... తగినన్ని నూనె... సరిపడా యాలకులపొడి... పావు టీ. మిరియాలపొడి... పావు టీ. ఉప్పు... చిటికెడు
తయారీ విధానం : సగ్గుబియ్యంలో బియ్యప్పిండి, పంచదారపొడి, బొంబాయిరవ్వ, పాలు, యాలకుల పొడి, మిరియాల పొడి, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా దోశెల పిండిలా కలిపి గంటసేపు నాననివ్వాలి. దోశెల పెనంమీద చిన్న గుంట గరిటెతో పిండిని పోస్తూ పామకుండా బిళ్లలుగా అలాగే ఉంచి కొద్దికొద్దిగా నూనె వేస్తూ సన్నటి సెగమీద మూత బోర్లించి వేయించాలి. కొద్దిసేపటి తరువాత వీటిని తిరగేసి దోరగా కాల్చాలి. మెత్తగా, తియ్యగా, టేస్టీగా ఉండే ఈ వంటకాన్ని పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు.