పండుగవేళ "సోన్ పాపిడి"తో తీపి రుచి..!!

FILE
కావలసిన పదార్థాలు :
శెనగపిండి.. ఒక కప్పు
మైదా.. ఒక కప్పు
నెయ్యి.. 200 గ్రా.
చక్కెర.. 2 కప్పులు
నీరు.. 2 కప్పులు
పాలు.. 2 టీ.
యాలకుల పొడి.. అర టీ.

తయారీ విధానం :
శెనగ, మైదా పిండిలను ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. ఒక బాణలిలో నెయ్యి వేసి వేడయ్యాక పిండిని పోసి బాగా రోస్ట్ అయ్యేదాకా వేయించి దించి పక్కనుంచాలి. మధ్యమధ్యలో ఆరేలా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఈలోగా చక్కెరలో నీళ్లుపోసి పాకం తయారు చేయాలి. పాకం మరుగుతుండగా పాలు కలిపి, మరో నిమిషం మరిగించాలి.

పాలు కలిపాక చక్కెరలోని మడ్డి అంతా పైకి తేలుతుంది. తరువాత పాకాన్ని వడబోసి మళ్లీ వేరే గిన్నెలో వేసి, యాలకులపొడి వేసి మరిగించాలి. ఆ తరువాత ఈ పాకాన్ని వేయించి ఉంచిన పిండిలో పోయాలి. పెద్ద పళ్లుండే ఫోర్క్‌తో పిండిలో పాకం కలిసేలా బాగా కలిపితే అది పొరపొరలుగా వస్తుంది. దీన్ని నెయ్యి రాసిన పళ్లెంలో వేసి చేతితోగానీ, మరో ప్లేట్‌తోగానీ ప్రెస్ చేసినట్లు అద్దాలి. వేడి తగ్గాక కట్ చేసి సర్వ్ చేయాలి.

వెబ్దునియా పై చదవండి