కావలసిన పదార్థాలు : కమలాపండ్లు... ఐదు ఆపిల్స్... రెండు అరటిపండు... ఒకటి ద్రాక్ష... ఒక కప్పు దానిమ్మ గింజలు... ఒక కప్పు పాలు... ఐదు కప్పులు కండెన్స్‌డ్ మిల్క్... ఒక డబ్బా యాలకుల పొడి... అర టీ. బాదం, పిస్తా, జీడిపప్పు... తలా ఐదు చొప్పున కుంకుమపువ్వు... నాలుగు కాడలు
తయారీ విధానం : కమలా పండ్ల తొక్కలు, గింజలను తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టాలి. పావుకప్పు వేడిపాలలో కుంకుమపువ్వు కలిపి పక్కన ఉంచాలి. మిగతా నాలుగున్నర కప్పుల పాలు సగం అయ్యేదాకా మరిగించి, కండెన్స్‌డ్ మిల్క్ కలపాలి. దానికి కుంకుమపువ్వు కలిపిన పాలను జత చేయాలి.
పాలు గది వాతావరణంలోకి వచ్చాక, ఫ్రిజ్‌లో ఉంచి చల్లబర్చాలి. ఇప్పుడు ఆ పాలను, పండ్లను ఒక ఒక పాత్రలో కలిపి, యాలకుల పొడి చల్లి.. నేతిలో వేయించిన పిస్తా, బాదం, జీడిపప్పు ముక్కలతో అలంకరించి సర్వ్ చేయాలి.