బ్రౌన్‌కలర్‌తో అలరించే "బటర్ రైస్ ఉండలు"

FILE
కావలసిన పదార్థాలు :
బటర్... 200 గ్రా.
వాము... మూడు టీ.
ఉప్పు... సరిపడా
చక్కెర... సరిపడా
బియ్యంపిండి...అర కి.
నూనె...అర లీ.
నువ్వులు... వంద గ్రా.

తయారీ విధానం :
ముందుగా వామును రోట్లో నూరుకుని పక్కన పెట్టుకోవాలి. స్టౌవ్‌మీద ఓ మందపాటి బాణలిలో నీళ్ళుపోసి అందులో చక్కెర, జీలకర్ర వాము వేసి కలపాలి. ఇందులో వెన్నతో కలుపుకున్న బియ్యం పిండిని మరుగుతున్న నీటిలో వేయాలి. దాన్ని ఉండలు కట్టకుండా బాగా కలియదిప్పాలి.

పిండి ఉడికి, గట్టిపడుతుండగా దింపి, కాసేపు చల్లారిన తరువాత చిన్న చిన్న ఉండలు చేసుకుని నెయ్యి రాసిన ప్లేట్‌లో ఉంచుకోవాలి. ఈ ఉండలను మరుగుతున్న నూనెలో బ్రౌన్‌కలర్ వచ్చేదాకా వేయించి, పొడిగా ఉన్న డబ్బాలో నిల్వచేసుకోవాలి.

వెబ్దునియా పై చదవండి