వికృతినామ ఉగాదికి మామిడి రుచుల మేళవింపు..!!

FILE
కావలసిన పదార్థాలు :
మామిడికాయ తురుము.. ఒక కప్పు
పచ్చికొబ్బరి తురుము.. ఒక కప్పు
నెయ్యి.. ఒక కప్పు
బొంబాయి రవ్వ.. ఒక కప్పు
పాలు.. అర కప్పు
పంచదార.. రుచికి తగినంత
యాలకుల పొడి.. ఒక టీ.
జీడిపప్పు, బాదం, కిస్‌మిస్.. అన్నీ కలిపి పావు కప్పు.

తయారీ విధానం :
ముందుగా బాణలిలో రెండు టీస్పూన్ల నెయ్యిని కరిగించి బొంబాయి రవ్వ, జీడిపప్పు, కిస్‌మిస్‌లను వేరు వేరుగా వేయించి పక్కనుంచుకోవాలి. అదే బాణలిలో మరో టీస్పూన్న నెయ్యి వేసి ముందుగా మామిడి తురుము, ఆపై కొబ్బరి తురుములను దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు దానికి బొంబాయి రవ్వ చేర్చి వేయించాలి.

ఐదు నిమిషాలపాటు అలాగే వేయించిన తరువాత అందులో పంచదార, పాలు (అవసరమైతే గ్రీన్ ఫుడ్ కలర్‌ను కలపవచ్చు), యాలకుల పొడి వేసి దగ్గరపడేంతదాకా సన్నని మంటపై ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేటులోకి మార్చి దానిపై బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌ల అందంగా పేర్చాలి. అంతే తీపి, పులుపు రుచులతో నోరూరించే మామిడి బర్ఫీ తయారైనట్లే..! ఈ వికృతినామ ఉగాది పర్వదినం రోజున మీరు కూడా వెరైటీ స్వీటును తయారు చేసేందుకు ట్రై చేస్తారు కదూ..?!

వెబ్దునియా పై చదవండి