వేడి వేడిగా, చల్ల చల్లగా.. "పిస్తా రైస్ ఖీర్"

FILE
కావలసిన పదార్థాలు :
పంచదార.. ఒక కప్పు
పాలు.. ఒక కప్పు
మంచినీళ్లు.. తగినన్ని
పిస్తా తరుగు.. 1/4 కప్పు
రైస్.. 1/2 కప్పు
యాలకుల పొడి.. తగినంత

తయారీ విధానం :
రైస్‌ను గంటసేపు నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి. ఒక పాత్రలో పాలు, పంచదార వేసి మరిగించాక అందులో రైస్ వేసి మెత్తగా ఉడికించాలి. మిశ్రమం గట్టిబడినట్లు అనిపిస్తే కాసిన్ని మంచినీళ్లు కలిపి ఉడికించవచ్చు. ఇది వేడిగా ఉన్నప్పుడే పైన పిస్తా తరుగు వేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే పిస్తా రైస్ ఖీర్ తయార్..! వేడిగా ఇష్టపడనివారు దీనిని ఫ్రిజ్‌లో ఉంచి చల్లబడిన తరువాత తీసి పైన అవసరమైతే యాలకుల పొడిని చల్లి తినవచ్చు.

వెబ్దునియా పై చదవండి