భారాస అభ్యర్థికి కారు ఆపిమరీ వార్నింగ్ ఇచ్చిన కొండా సురేఖ
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ నన్నపునేని నరేందర్‌కు మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారాస అభ్యర్థి కారు ఆపి మరీ ఈ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీతో కలిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే కుట్రలను మానుకోవాలని హెచ్చరించారు. తమ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తేలేదని ఆమె వార్నింగ్ ఇచ్చారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.