ఏప్రిల్‌ 3వరకు వరంగల్‌ నిట్‌కి సెలవులు

సోమవారం, 16 మార్చి 2020 (08:59 IST)
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ ప్రబలకుండా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల్ని మూసివేయాలని సర్కార్‌ గట్టి నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 3వరకు వరంగల్‌ నిట్‌కు సెలవులు ప్రకటించారు.

కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా... ముందస్తు జాగ్రత్తలలో భాగంగా వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్‌)కి సెలవులను ప్రకటించారు.

ఏప్రిల్ 3వ తేదీ వరకు నిట్‌లోని బోధనా తరగతులు, ప్రయోగశాలలు, కార్యశాలలు, సెమినార్ల వంటి అన్ని విభాగాలకు ఈ సెలవులు వర్తిస్తాయని నిట్​ అధికారులు తెలిపారు. విద్యార్థులను తమ స్వస్థలాలకు వెళ్లాల్సిందిగా సూచించారు.

ఇళ్లకు వెళ్లలేని వారు... విదేశీ విద్యార్థులకు వసతిగృహంలో ఉండేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. గత మూడు రోజుల క్రితం అమెరికా నుంచి క్యాంపస్‌కి తిరిగి వచ్చిన పీహెచ్‌డీ విద్యార్ధికి కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో.. వరంగల్ ఎంజీఎంలో పరీక్షలు నిర్వహించారు.

ఆ విద్యార్థికి కరోనా లక్షణాలు లేవని నిరూపణ కావటం వల్ల నిట్ అధికారులతో పాటు జిల్లా వైద్యశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
 
ఏప్రిల్​ 20లోగా అమీర్​పేటలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం
హైదరాబాద్​ అమీర్​పేటలో నిర్మిస్తున్న 50పడకల ఆసుపత్రిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​తో కలిసి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​ సందర్శించారు. ఏప్రిల్​ 20లోగా ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

హైదరాబాద్ అమీర్‌పేటలో 50పడకల ఆసుపత్రిని ఏప్రిల్ 20లోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ కృషితో మూడేళ్లలోనే ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తికావచ్చిందని పేర్కొన్నారు.

మంత్రి తలసానితో కలిసి ఆసుపత్రిని ఆయన సందర్శించారు. పనుల పురోగతి, ఇతర మౌలిక సదుపాలయాల కల్పనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు