మంచిర్యాలలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తన ఆరేళ్ల కుమార్తె సరిగా చదవడం లేదని, మాట వినడం లేదనే సాకుతో ఆమెను బైక్‌పై ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేని సమయం చూసి, ఆ చిన్నారిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. తండ్రి కొడుతున్న దెబ్బలకు తట్టుకోలేక ఆ పసిపాప కేకలు వేస్తూ విలవిలలాడిపోయింది.