పని ఒత్తిడి, అప్పుల బాధ.. ఏడో అంతస్థు నుంచి దూకేసిన టెక్కీ

సెల్వి

శుక్రవారం, 25 అక్టోబరు 2024 (16:23 IST)
హైదరాబాద్, కోకాపేటలో 27 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగ ప్రభాకర్‌గా గుర్తించారు. నాగ ప్రభాకర్ కోకాపేటలోని తన హాస్టల్ గదికి వచ్చి భవనంలోని ఏడో అంతస్తు నుంచి దూకినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అప్పుల బాధ, పని ఒత్తిడి కారణంగానే నాగ ప్రభాకర్ ఈ చర్య తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు