తెలంగాణ జిల్లాల నుంచి తిరువణ్ణామలైకు ప్రత్యేక బస్సులు!! (Video)

వరుణ్

ఆదివారం, 14 జులై 2024 (15:07 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ అరుణాచలేశ్వర స్వామి గిరిప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీ ఆర్టీసీ ఓ శుభవార్త చెప్పింది. గురు పౌర్ణమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణలోని హైదరాబాద్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, నల్లగొండ, వరంగల్‌, కరీంనగర్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబుబ్‌నగర్‌, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఏర్పాటు చేసింది. 
 
ఈ నెల 21న గురుపౌర్ణమి కాగా.. 19వ తేది నుంచి 22వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. ఈ ప్యాకేజీలో కాణిపాక వరసిద్ది వినాయక స్వామితో పాటు శ్రీపురంలోని గొల్డెన్‌ టెంపుల్‌ను సందర్శించే సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అరుణాచలగిరి ప్రదక్షిణ ప్యాకేజీ బుకింగ్‌ కోసం http://tsrtconline.in వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

 

తమిళనాడులోని అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు శుభవార్త! గురు పౌర్ణమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణలోని హైదరాబాద్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, నల్లగొండ, వరంగల్‌, కరీంనగర్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబుబ్‌నగర్‌, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను… pic.twitter.com/2s65B24x8v

— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) July 14, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు