ఆ డివిజన్ల పరిధిలో వారం రోజుల పాటు 20 రైళ్లు రద్దు

ఆదివారం, 13 ఆగస్టు 2023 (09:19 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ డివిజన్ల పరిధిలో వివిధ రకాల నిర్వహణ, ఇంజనీరింగ్ పనుల కారణంగా 20 రైళ్లను వారం పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇందులో 18 రైళ్లు ఈ నెల 14 నుంచి 20 వరకు, రెండు రైళ్లు 15 నుంచి 21 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని తెలిపింది. 
 
రద్దు చేసిన రైళ్లలో కాజీపేట - డోర్నకల్‌ - కాజీపేట, డోర్నకల్‌ - విజయవాడ - డోర్నకల్‌, భద్రాచలం రోడ్‌ - విజయవాడ - భద్రాచలంరోడ్‌, కాజీపేట - సిర్పుర్‌టౌన్‌, బళ్లారి - కాజీపేట, భద్రాచలం రోడ్‌ - బళ్లారి, సిర్పుర్‌ టౌన్‌ - భద్రాచలం రోడ్‌, సికింద్రాబాద్‌ - వరంగల్‌ - సికింద్రాబాద్‌, సిర్పుర్‌ టౌన్‌ - సికింద్రాబాద్‌ - సిర్పుర్‌ టౌన్‌, కరీంనగర్‌ - నిజామాబాద్‌ - కరీంనగర్‌, కాజీపేట - బళ్లారి - కాజీపేట, కాచిగూడ - నిజామాబాద్‌ - కాచిగూడ రైళ్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 ఎంఎంటీఎస్‌ రైళ్లను కూడా 14నుంచి 20వ వరకు రద్దు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు