గాఢంగా ప్రేమించిన ప్రియురాలు అలాంటిదని ప్రేమికుడు ఏం చేశాడంటే..?

బుధవారం, 14 నవంబరు 2018 (15:18 IST)
అది హైదరాబాద్ లోని రామాంతపురంకు సమీపంలో ఉన్న వెంకట్రావునగర్ బస్ స్టేషన్. నిఖిల్ అనే యువకుడు ఇంటర్వ్యూ కోసం వెంకట్రావు నగర్ బస్టాప్‌లో దిగి హడావిడిగా వెళుతున్నాడు. బస్టాప్‌కు సరిగ్గా పది అడుగుల దూరంలో ఒక హ్యాండ్ బ్యాగ్ పడిపోయి ఉంది. హ్యాండ్ బాగ్ ఎవరిదోనని అటూఇటూ చూస్తున్నాడు. ఎవరూ రాలేదు. దీంతో ఆ హ్యాండ్ బాగ్‌ను తీసుకుని ఇంటర్య్వూకు వెళ్ళాడు. ఇంటర్వ్యూలో ఫెయిలై తిరిగి వచ్చి పక్కనే ఉన్న టీ కొట్టులో టీ తాగుతూ ఉన్నాడు.
 
ఇంతలో దొరికిన హ్యాండ్ బ్యాగ్‌లో ఫోన్ రింగవుతూ కనిపించింది. వెంటనే ఫోన్ తీసిన నిఖిల్ ఎవరని ప్రశ్నించాడు. సర్.. నేను బస్సు ఎక్కుతూ హడావిడిగా బ్యాగ్ మర్చిపోయానంటూ చెప్పింది అమ్మాయి. నేను ఇప్పుడు వెంకట్రావు నగర్ సమీపంలో ఉన్న టీ కొట్టులో ఉన్నాను. వచ్చి బ్యాగ్ తీసుకెళ్ళండి అన్నాడు. బ్యాగు కోసం వచ్చిన అమ్మాయి ఎంతో అందంగా ఉంది. ఆ అమ్మాయిని చూసిన నిఖిల్ ఆశ్చర్యంగా నిలబడిపోయాడు. ఈ బ్యాగ్ నాదేనంటూ చెప్పగానే బ్యాగ్ ఇచ్చాడు. నీ పేరు ఏమిటంటూ అడిగాడు. అనుపమ అని చెప్పింది. ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. 
 
ఇంటర్వ్యూలకు వెళ్ళడం పక్కనబెట్టి అనుపమను లైన్‌లో పెట్టడం ప్రారంభించాడు. కొన్నిరోజులకే అనుపమ నిఖిల్ ప్రేమలో పడిపోయింది. ఆ తరువాత రెండు నెలల వరకు వీరి ప్రేమ వ్యవహారం సాగింది. తన ప్రేమ విషయాన్ని తన స్నేహితుడు ప్రసాద్‌కి చెప్పి పార్టీకి పిలిచాడు నిఖిల్. ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారు. తన ప్రేయసి ఫోటోను స్నేహితుడు ప్రసాద్‌కి చూపించాడు నిఖిల్. జరిగిన కథంతా చెప్పాడు. ఈ అమ్మాయి నాకెప్పుడో తెలుసు. చాలాచోట్ల బ్యాగులు పడేసుకుని అబ్బాయిలకు దగ్గరై డబ్బులు గుంజుకుని ఆ తరువాత వదిలేస్తుంది. ఈ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్ కాదంటూ చెప్పాడు ప్రసాద్. దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు నిఖిల్. 
 
మద్యం మత్తులో ప్రసాద్ ఫోన్ నుంచి ఫోన్ చేసి రేపు ఉదయం వెంకట్రామాపురం బస్ స్టేషన్‌కు సమీపంలోని పాత అపార్టుమెంట్ వెనుక కలద్దామన్నాడు. ఆమె రాగానే తన చేతిలోని బీర్ బాటిల్‌తో అనుపమ తలపై మోదాడు. దీంతో అనుపమ అక్కడికక్కడే చనిపోయింది. ఏం జరిగిందో కూడా అడుగకుండా ఆమెను అతి దారుణంగా చంపేశాడు నిఖిల్. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు అనుపమ పక్కనే ఉన్న ఫోన్‌ను చూశారు. ఫోన్‌లో నిఖిల్ ఫోటో ఉండగా అతన్ని ఘటనా స్థలానికి పిలిపించారు. పోలీసులకు ఏం తెలియనట్లుగా సమాధానమిచ్చాడు నిఖిల్. క్లూస్ టీం రంగంలోకి దిగింది. సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించింది. అనుపమ మృతదేహం పక్కన నిఖిల్ షూ అడుగులను గుర్తించారు క్లూస్ టీం. దీంతో నిందితుడు నిఖిలే అని నిర్థారణకు వచ్చారు. 
 
అంతేకాదు నిఖిల్ ఇచ్చిన సమాచారంతో ప్రసాద్‌ను ఘటనా స్థలానికి తీసుకొచ్చారు. అయితే ప్రసాద్ అసలు విషయాన్ని పోలీసులకు తెలిపాడు. రెండు నెలలుగా ప్రేమలో ఉన్న తన స్నేహితుడు నిఖిల్ తనను పట్టించుకోవడం లేదని, ఖర్చుల కోసం డబ్బులు కూడా ఇవ్వడం లేదని, దీంతో అనుపమ నుంచి నిఖిల్‌ను దూరం చేస్తే మళ్ళీ నిఖిల్‌తో కలిసి తిరగవచ్చని భావించి అబద్ధం చెప్పినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ప్రసాద్ నోట మాటలు విన్న నిఖిల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో తెలుసుకోకుండా గాఢంగా ప్రేమించిన అనుపమను చంపేయడంతో వెక్కివెక్కి ఏడ్చాడు నిఖిల్. కానీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన యువతి ప్రాణాలను తీసుకురాగలడా?

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు