ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్‌కు చెందిన సురేందర్ అనే ఆయన తిమ్మాపూర్ లోని ఓ పేరుగాంచిన ఇంజనీరింగ్ కళాశాలలో ఈసిఈ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అయితే విద్యార్థులకు చదువు చెప్పాల్సిన సదరు అధ్యాపకుడు... వాట్సాప్‌లో వెకిలి చేష్టలు మొదలెట్టాడు. సదరు ఉపాధ్యాయుడి నిర్వాకంతో కొంతమంది విద్యార్థినిలు ఇప్పటికే చదువును మానేశారని అంటున్నారు.
అమ్మాయిలు మొండికేస్తే... ఇంటర్నల్ ఎగ్జామ్స్‌లో ఫెయిల్ చేస్తానని బెదిరింపులకు కూడా దిగుతాడట. ఈ సార్ దెబ్బకి ఇప్పటికే చాలామంది అమ్మాయిలు చదువును మానేస్తే... కొంతమంది మాత్రం నిజమేనని నమ్మి మోసపోయిన దాఖలాలు కూడా ఉన్నాయట. తాజాగా ఓ విద్యార్థినికి ఇలాగే వాట్సప్‌లో... నీ కళ్ళు బాగుంటాయని... ఇంకా అవి బాగుంటాయి ఇవి బాగుంటాయంటూ నువ్వంటే నాకిష్టమంటూ మెసేజిలు పంపించాడు. పైగా రూమ్‌కు రమ్మంటూ అసభ్యకరమైన మెసేజులు పెట్టాడు. దీనికి సదరు విద్యార్థిని రూమ్‌కెందుకు సార్ అంటూ ప్రశ్నిస్తే... అర్థం చేసుకోవాలని... పైగా... నీకు ఫీలింగ్స్ లేవా అంటూ మరో మెసేజ్ పంపించాడు.